జనసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
close

తాజా వార్తలు

Updated : 26/01/2020 14:09 IST

జనసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

మంగళగిరి: 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘ అన్ని మతాల విశ్వాసాలు, అందరికీ గౌరవం ఇచ్చే దేశం మనది. జనగణమన పాడి జెండా ఎగరేయడం కాదు... ఎంత మంది కష్టంతో స్వాతంత్ర్యం వచ్చిందో తెలుసుకోవాలి. ప్రతిక్షణం దేశాన్ని  కాపాడుకోవాలి. ప్రజా స్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం మన దేశం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పలువురు జనసేన నేతలు, కార్యకర్తలు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని