మెదడులో భావోద్వేగాల గుట్టు తెలిసింది
close

తాజా వార్తలు

Updated : 27/01/2020 07:36 IST

మెదడులో భావోద్వేగాల గుట్టు తెలిసింది

లండన్‌: సందర్భోచితంగా మనలో అనేకరకాల భావోద్వేగాలు చెలరేగుతుంటాయి. ఇవన్నీ మెదడులో 3 సెంటీమీటర్ల ప్రాంతంలోనే కలుగుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కుంగుబాటు, భయాలు వంటి సమస్యలకు సంబంధించిన గుట్టుమట్లను వెలుగులోకి తీసుకురావడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని వివరించారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 15 మంది వలంటీర్లను ఎంచుకున్నారు. వారికి 1994లో వచ్చిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే చిత్రాన్ని ప్రదర్శిస్తూ వారిలో తలెత్తిన భావోద్వేగాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఫంక్షనల్‌ మ్యాగ్నెటిక్‌ రెజోనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎఫ్‌ఎంఆర్‌ఐ)తో వారి మెదళ్లను పరిశీలించారు. రెండు అంశాలనూ పోల్చి చూశారు. భావోద్వేగాలు చెలరేగినప్పుడు టెంపోరో-పేరియెటల్‌ ప్రాంతాల్లోని రెండు లోబుల్లో నాడులు క్రియాశీలమైనట్లు గుర్తించారు. ఈ నాడుల తీరుతెన్నులను శోధించడం ద్వారా కీలకాంశాలను తెలుసుకోవచ్చని వారు పేర్కొన్నారు. భావోద్వేగాల తీవ్రత, నాణ్యతను నియంత్రించే కీలకాంశాలను గుర్తించడం వల్ల మానసిక అనారోగ్యంపై అవగాహన పెరుగుతుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని