అనుమతి కోరితే.. చెప్పుతో కొట్టిన అధికారిణి

తాజా వార్తలు

Published : 29/01/2020 15:34 IST

అనుమతి కోరితే.. చెప్పుతో కొట్టిన అధికారిణి

పికెట్(కంటోన్మెంట్)‌: ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం అడగటమే కాకుండా ఓ మహిళా అధికారిణి యజమానిపై చెప్పుతో దాడి చేసింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు చెందిన దశరథరామిరెడ్డి గత మూడేళ్లుగా ఇంటి నిర్మాణ అనుమతి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కాని వారు అనుమతి ఇవ్వకుండా లంచం అడుగుతూ వేధింపులకు గురి చేస్తున్నారని అతడు ఆరోపిస్తున్నాడు. కోర్టుకు వెళ్లి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. మంగళవారం కంటోన్మెంట్‌ అధికారులు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చారు. ఈ క్రమంలో దశరథరామిరెడ్డి మరోసారి నిర్మాణ అనుమతులు కోరగా మహిళా అధికారి ఆగ్రహంతో అతడిపై చెప్పులతో దాడికి పాల్పడింది. అతను ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు తిరిగి అతనిపైనే కేసు నమోదు చేశారని బాధితుడు వాపోయాడు. దాడి చేసిన అధికారిణిపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని అతడు డిమాండ్‌ చేశాడు.

 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని