తెలంగాణకు రూ.లక్ష జరిమానా

తాజా వార్తలు

Updated : 30/01/2020 07:33 IST

తెలంగాణకు రూ.లక్ష జరిమానా

ఈనాడు, దిల్లీ: సత్వర న్యాయం నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై ప్రమాణ పత్రం దాఖలు చేయని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సొసైటీస్‌ ఫర్‌ ఫాస్ట్‌ జస్టిస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రమాణ పత్రం దాఖలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాయో కారణాలు చెప్పాలన్నారు.  ప్రమాణపత్రం దాఖలు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా 50వేల బ్లాకుల్లో గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. వీటీలో 320 బ్లాకులను గుర్తించగా 204 మాత్రమే పని చేస్తున్నాయని ప్రశాంత్‌భూషణ్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. డిసెంబరు 18, 2019లోగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలపై ప్రమాణపత్రాలు సమర్పించాలని గతేడాది అక్టోబరు 10న ధర్మాసనం ఆదేశాలిచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని