మనోజ్‌ తివారీ పాటలు నాకెంతో ఇష్టం: కేజ్రీవాల్‌

తాజా వార్తలు

Published : 07/02/2020 00:33 IST

మనోజ్‌ తివారీ పాటలు నాకెంతో ఇష్టం: కేజ్రీవాల్‌

దిల్లీ: సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దిల్లీ భాజపా చీఫ్ మనోజ్‌ తివారీ గురించి ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను, మనోజ్‌ రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ ఆయన పాటలు, డ్యాన్స్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని కేజ్రీవాల్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మనోజ్‌ నృత్యానికి తాను పెద్ద అభిమానిని, తానెక్కడికెళ్లినా అతడి పాటలు వినమని ఇతరుల్ని కూడా కోరుతాను’ అని వెల్లడించారు. కేజ్రీవాల్‌ ఇటీవల తివారీని ‘రింకియాకే పాపా’ అని ఆయన పాడిన పాటనే ఉద్దేశిస్తూ.. మంచి గాయకుడని పేర్కొన్నారు. దీంతో తివారీ స్పందిస్తూ.. కేజ్రీవాల్‌ ఆ పాట ద్వారా పూర్వాంచల్‌ ప్రజలను, వారి సంస్కృతిని అవమానించారని ఆరోపించారు. ఆ ఆరోపణలపై మీరెలా స్పందిస్తారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా.. నేను తివారీ పాడిన ‘రింకియాకే పాపా’ పాట ద్వారా ఎవర్నీ అపహాస్యం చేయలేదు. ఆయన మంచి గాయకుడు.. మంచి పాటలు పాడతారు’ అని ప్రశంసించాను. అందులో అవమానించదగ్గ విషయం ఏముందో నాకు అర్థం కాలేదని బదులిచ్చారు.  పూర్వంచాలిస్‌ అంటే దిల్లీలో ఉండే తూర్పు యూపీ, బిహార్‌ ప్రజలు. దిల్లీ ఎన్నికల్లో వీరే కీలక పాత్ర పోషించనున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని