తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభం

తాజా వార్తలు

Updated : 16/02/2020 17:23 IST

తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఆయా అంశాలపై చర్చించిన అనంతరం వాటికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రభుత్వ విధానాన్ని కేసీఆర్‌ వెల్లడించనున్నట్లు తెలిసింది. 

రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలతో పాటు మరికొన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈశాఖల్లో మొత్తం 2 వేలకు పైగా పోస్టుల ఖాళీలున్నట్లు సమాచారం. పాలనా సంస్కరణలు, కొత్త రెవెన్యూ చట్టంపై మంత్రిమండలి చర్చించి, దానికి తుదిరూపు ఇవ్వనుంది. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశముంది. దీంతో పాటు శాసనసభ బడ్జెట్‌ సమావేశాల తేదీలను కూడా ఈ సమావేశంలోనే ఖరారు చేసే వీలుంది. శాసనసభ సమావేశాలను మార్చి మొదటివారంలో నిర్వహించే అవకాశముంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని