సి విటమిన్‌తో తగ్గనున్న వెంటిలేషన్‌ సమయం
close

తాజా వార్తలు

Published : 16/02/2020 22:27 IST

సి విటమిన్‌తో తగ్గనున్న వెంటిలేషన్‌ సమయం

వాషింగ్టన్‌: తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో ఉండే రోగులకు సి విటమిన్‌ వల్ల ప్రయోజనం కలుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. వీరు వెంటిలేషన్‌పై ఉండాల్సిన సమయాన్ని ఇది తగ్గిస్తుందని వెల్లడైంది. సి విటమిన్‌ వల్ల అనేక బయోరసాయన ప్రయోజనాలు ఉంటాయి. నారెపైన్‌ఫ్రైన్, వాసోప్రెసిన్‌ విడుదలలో దోహదపడటం ద్వారా అది గుండె వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కార్నిటైన్‌ ఉత్పత్తికి సాయపడటం ద్వారా శక్తికి సంబంధించిన చ్కీజీజివక్రియను ప్రభావితం చేస్తుంది. సి విటమిన్‌ ద్వారా రక్తపోటు తగ్గుతున్నట్లు గతంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అలాగే గుండె ఎక్కువగా కొట్టుకునే సమస్యను, శ్వాసనాళాల్లో వ్యాకోచాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది. తీవ్రస్థాయిలో అస్వస్థులుగా ఉన్నవారిలో విటమిన్‌ సి ప్లాస్మా స్థాయి తక్కువగా ఉంటుంది. ఆరోగ్యవంతులు రోజుకు 0.1 గ్రాముల మేర ఈ విటమిన్‌ను తీసుకోవడం ద్వారా సాధారణ ప్లాస్మా స్థాయిని పరిరక్షించుకోవచ్చు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి ఇంకా ఎక్కువ మోతాదులో సి విటమిన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 

విటమిన్‌ సి తీసుకున్నవారిలో వెంటిలేషన్‌ సమయం సరాసరిన 14 శాతం మేర తగ్గుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే అనారోగ్యం స్థాయిపై ఇది ఆధారపడి ఉంటుందని వివరించింది. 10 గంటల కన్నా ఎక్కువసేపు ఈ ప్రాణాధార వ్యవస్థపై ఉండేవారిలో ‘సి’ ఎలాంటి ప్రభావం కనిపించలేదు. 10 గంటల కన్నా ఎక్కువసేపు వెంటిలేషన్‌ అవసరమైన 471 మంది రోగులపై నిర్వహించిన ఐదు ప్రయోగాల్లో మాత్రం సి విటమిన్‌ ప్రభావం గణనీయంగా కనిపించింది. వీరికి రోజుకు 1-6 గ్రాముల మేర సదరు విటమిన్‌ను ఇవ్వడం వల్ల వీరికి ప్రాణాధార వ్యవస్థపై ఉండాల్సిన అవసరం సరాసరిన 25 శాతం తగ్గుతున్నట్లు నిర్ధరించారు. అయితే నిర్దిష్ట మోతాదును తేల్చడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని