కదిలే రైలులో టిక్‌టాక్‌ స్టంట్‌.. ఖండించిన మంత్రి!

తాజా వార్తలు

Published : 18/02/2020 17:38 IST

కదిలే రైలులో టిక్‌టాక్‌ స్టంట్‌.. ఖండించిన మంత్రి!

ఇంటర్నెట్‌డెస్క్‌: రైళ్లో నుంచి టిక్‌టాక్‌ వీడియో కోసం ఎంతో ప్రమాదకరంగా స్టంట్‌ చేసిన ఓ వీడియోపై కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయెల్‌ తీవ్రంగా స్పందించారు. అలాంటి ప్రమాదకర చేష్టలను వ్యక్తుల మూర్ఖత్వంతో పోల్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ‘ఓ యువకుడు టిక్‌టాక్‌ వీడియో రూపొందించే క్రమంలో ప్రమాదకరంగా రైలుకు వేలాడుతూ ప్రయాణం చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడి కాలు అదుపుతప్పి నేలకు తగలడంతో రైలు నుంచి నియంత్రణ కోల్పోయి కింద పడిపోతాడు. కేవలం అంగుళాల పరిధిలో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాడు’ ఇది వీడియో సారాంశం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌ దృష్టి వెళ్లింది. దీంతో ఆయన ట్విటర్‌ ద్వారా తీవ్రంగా స్పందించారు. ఆ వీడియో పోస్ట్‌ చేస్తూ.. ‘కదులుతున్న రైలులో ఇలాంటి సాహసాలు చేయడం ధైర్యం చేయడం అనుకుంటున్నారా.. కాదు.. అది మూర్ఖత్వం మాత్రమే. అని అన్నారు. ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి సాహసాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని