శ్రీవారి భక్తులకు ఇకపై ‘వడ’ ప్రసాదం
close

తాజా వార్తలు

Published : 20/02/2020 01:23 IST

శ్రీవారి భక్తులకు ఇకపై ‘వడ’ ప్రసాదం

తిరుమల: తిరుమలలో శ్రీవారి ప్రసాదాలను తితిదే సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈనెల 12వ తేదీన కల్యాణం లడ్డూను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చిన తితిదే రేపటి నుంచి వడ ప్రసాదాన్ని కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు భక్తులకు అవసరమైనన్ని వడలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ తెలిపారు. వడ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. గురువారం నుంచి భక్తులకు వడ ప్రసాదం అందుబాటులోకి తీసుకురానున్నారు. నిత్యం సుమారు 10 వేల కల్యాణం లడ్డూలు, 10 వేల వడ ప్రసాదం అందించేందుకు తితిదే సమాయత్తం అవుతోందని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూలను సామాన్యులకూ తితిదే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి సిఫార్సు లేఖలు అవసరం లేకుండా ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తోంది. లడ్డూ ప్రధాన విక్రయ కేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి విక్రయాలను ప్రారంభించింది. చిన్న లడ్డూతో పాటు కల్యాణోత్సవ లడ్డూను విక్రయిస్తున్నారు. దీని ధరను రూ.200గా నిర్ణయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని