79 ఇంటర్‌ కళాశాలలకు నోటీసులు

తాజా వార్తలు

Updated : 22/02/2020 21:18 IST

79 ఇంటర్‌ కళాశాలలకు నోటీసులు

స్పందించకపోతే మూసేస్తామని ఇంటర్‌ బోర్డు హెచ్చరిక

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపులేని కళాశాలలకు ఇంటర్‌ బోర్డు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు కళాశాలలకు శనివారం నోటీసులు ఇచ్చింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని 79 కళాశాలలకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. తమ నోటీసులకు సకాలంలో స్పందించకపోతే కళాశాలల్ని మూసివేస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ హెచ్చరించారు. 

రాష్ట్రంలో గుర్తింపులేని కళాశాలలపై ఈ నెల 25 లోపు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందన్న జలీల్‌.. కోర్టు ఆదేశాల అమలుకు యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఈ మేరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు శనివారం సమావేశం నిర్వహించారు. కొన్ని కళాశాలలకు అగ్నిమాపక శాఖ అనుమతి కూడాలేదన్నారు. మరికొన్ని కళాశాలలు అనుమతి లేకుండా వేరే చోట నడుపుతున్నట్టు చెప్పారు. ఈ నెల 25లోపు హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామని ఆయన వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని