‘రెయిన్‌బో స్నేక్‌’.. 50ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!

తాజా వార్తలు

Published : 24/02/2020 00:43 IST

‘రెయిన్‌బో స్నేక్‌’.. 50ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!

ఒర్లాండో: ‘రెయిన్‌బో స్నేక్‌’ పాము జాతుల్లో ఇదో అరుదైన జాతి. దీని శరీరంపై విభిన్న రంగులు మిళితమై ఉంటాయి. అంతటి అరుదైన పాము ఇటీవల ఫ్లోరిడాలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్లోరిడా ఫిష్‌, వైల్డ్‌లైఫ్ పరిశోధనా కేంద్రం ఫేస్‌బుక్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ట్రేసీ కాథెన్ అనే వ్యక్తి ఇటీవల ఒకాలా జాతీయ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ విభిన్న రంగుల్లో ఉన్న నాలుగు అడుగుల పొడవైన పామును అతడు గుర్తించాడు. అతడు తీసిన ఫొటోలు ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని గుర్తించిన నిపుణులు ఆ పామును రెయిన్‌బో స్నేక్‌గా నిర్ధరించారు. ఫ్లోరిడాలో దాదాపు 50ఏళ్ల తర్వాత ఈ జాతి మళ్లీ కనిపించినట్లు మ్యూజియం అధికారులు వెల్లడించారు. ఇది విష రహితమైనదని చెప్పారు. అవి జలచర జీవులని, ఎక్కువగా నీటిలో సంచరిస్తుంటాయని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని