మహ్మద్‌ పాషా.. ఎంత గొప్ప మనసో!

తాజా వార్తలు

Updated : 26/02/2020 18:02 IST

మహ్మద్‌ పాషా.. ఎంత గొప్ప మనసో!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంచే గుణమే లేకపోతే ఈ ప్రపంచమే శూన్యమంటారో సినీ మహాకవి. తన వద్ద ఉన్నదానిలో కొంత భాగాన్ని మరో జీవికి  ఇచ్చే గుణం లేకపోతే సంబంధాలు ముందుకు సాగవు. అవి అక్కడితోనే అంతమయిపోతాయనేది ఆ కవి చెప్పిన గొప్ప మాటలోని ఒక సారాంశం. నేటి సమాజంలో మానవ సంబంధాలే నానాటికీ క్షీణిస్తున్న నేపథ్యంలో తనకు పూట గడవడమే కష్టమైన మహ్మద్‌ పాషా అనే వ్యక్తి తన వద్ద ఉన్న ఆహారంలో కొంత మూగ జీవాలకు పంచడం ద్వారా స్ఫూర్తిని చాటుతున్నాడు.

పాషాకు పూట గడవటం కూడా కష్టమే. చాదర్‌ఘాట్‌ నుంచి ముసారాంబాగ్‌ వరకు రోజూ నడుచుకొని ప్లాస్టిక్‌ చెత్తను సేకరిస్తుంటాడు. ఆ ప్లాస్టిక్‌ కప్పులను తీసుకెళ్లి రీసైకిల్‌బిన్‌ ప్లాంట్‌కు ఇవ్వడం.. వారు ఇచ్చిన డబ్బులతో తన జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. మధ్య వయసున్న పాషా.. ముషారాబాంగ్‌ వద్ద మెట్రో కింద లస్సీ దుకాణంలో ప్లాస్టిక్‌ కప్పులు ఏరుకుంటాడు. ఈ క్రమంలో అతడికి రోజుకు రూ.100 వస్తేనే మహా గొప్ప. ఫుట్‌పాత్‌లపైనే తిరుగుతూ ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నా తన వద్ద ఉన్న ఆహారంలో కొంత ఇలా మూగ జీవాలకు పెట్టడం ద్వారా స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కోట్లాది రూపాయాలున్నా  తమ దానగుణాన్ని ప్రదర్శించని ఎంతో మంది జీవిస్తున్న ఈ సమాజంలో ప్లాస్టిక్‌ ఏరుకొని దాన్ని విక్రయించగా వచ్చిన డబ్బులతోనే బతుకు నెట్టుకొస్తూ మూగజీవాలకు ఆహారం అందిస్తున్న ఈ మహ్మద్‌ పాషా.. ఓ మనసున్న గొప్పవాడే కదా మరి!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని