కాకినాడలో ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన

తాజా వార్తలు

Updated : 26/02/2020 19:20 IST

కాకినాడలో ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన

కాకినాడ: కార్మికుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రికి బుధవారం ఆయన  శంకుస్థాపన చేశారు. సాంబమూర్తి నగర్‌లో రూ.110కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగ్వార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50లక్షల మంది కార్మికులు ఈఎస్‌ఐ ఆస్పత్రి పరిధిలోకి వస్తారన్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందిచనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రులు సమర్థంగా పనిచేస్తున్నాయని గంగ్వార్‌ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రుల తరహాలో ఏపీలోనూ సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈఎస్‌ఐ కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

అనంతరం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కార్మికులకు క్యాన్సర్‌ అధికంగా వస్తోందని.. కాకినాడ ఈఎస్‌ఐ ఆస్పత్రిని క్యాన్సర్‌ పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జయరాం, కన్నబాబు, విశ్వరూప్‌, ఎంపీ వంగా గీత తదితరులు పాల్గొన్నారు.  

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని