కొత్త జిల్లాల్లోనూ కేవీకేలు ఏర్పాటు చేయండి

తాజా వార్తలు

Published : 28/02/2020 00:34 IST

కొత్త జిల్లాల్లోనూ కేవీకేలు ఏర్పాటు చేయండి

వ్యవసాయ పరిశోధన మండలి సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి

దిల్లీ: రాష్ట్రంలో కందులకు కేంద్రం క్వింటాల్‌కు రూ.5,800 మద్దతు ధర ప్రకటించిందని, కానీ  మార్కెట్లో రూ. 4,600 మించి అమ్ముడుపోవడం లేదని తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మద్దతు ధరతో కొనుగోలుకు కేంద్రం 47,500 మెట్రిక్‌ టన్నులకు అనుమతిచ్చిందని చెప్పారు. ఇవాళ మరో 4,500 మెట్రిక్ టన్నులకు అనుమతిచ్చారని ఆయన తెలిపారు. మరో 50 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి చెప్పారు. దిల్లీలో నిర్వహించిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి 91వ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

వ్యవసాయ విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలను కాలానుగుణంగా వ్యవసాయ పరిశోధనా మండలి అందిస్తోందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను పెంచుతూ రైతుల ఆదాయం పెరిగేలా ఐసీఏఆర్ చూస్తోందన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే) ఏర్పాటు ఆవశ్యకతను సమావేశంలో వివరించినట్లు తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోనూ కేవీకేలను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఎన్జీవోలు నిర్వహిస్తున్న కేవీకేలను సమీక్షించి అవసరమైతే ఆ బాధ్యతలను విశ్వవిద్యాలయాలకు అప్పగించాలని చెప్పామని నిరంజన్‌రెడ్డి వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని