కరోనాకు చికెన్‌తో సంబంధం లేదు: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 29/02/2020 00:23 IST

కరోనాకు చికెన్‌తో సంబంధం లేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌కు చికెన్‌కు సంబంధం లేదని తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. చికెన్‌పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్ల నేపథ్యంలో పౌల్ట్రీ సమాఖ్య, నెక్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో చికెన్‌, ఎగ్‌ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాకు మంత్రులు హాజరయ్యారు. మంత్రులు కేటీఆర్‌, ఈటలతో పాటు తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు చికెన్‌ ముక్క రుచి చూశారు.  సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపోహలను నమ్మవద్దని మంత్రులు పిలుపునిచ్చారు. వదంతులతో చికెన్‌ మార్కెట్‌ బాగా దెబ్బతిందని, వెంటనే తిరిగి పుంజుకోవాలని ఈటల ఆకాంక్షించారు. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని స్పష్టం చేశారు.

చికెన్‌, ఎగ్‌ మేళా సందర్భంగా నోరూరించే వంటకాలతో పీపుల్స్‌ ప్లాజా ఘుమఘుమలాడింది. చికెన్‌ ప్రియులు మేళాలో పాల్గొని అద్భుత వంటకాలను రుచి చూశారు. అనవసర భయాలతో చికెన్‌ తినేయడం మానేయవద్దని పలువురు వైద్యులు సూచించారు. పుకార్లు నమ్మి పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బతీయవద్దని మేళా నిర్వాహకులు కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని