కూలిన పెళ్లి మండపం..ఎమ్మెల్యేకు గాయాలు

తాజా వార్తలు

Published : 29/02/2020 08:17 IST

కూలిన పెళ్లి మండపం..ఎమ్మెల్యేకు గాయాలు

ఉండవల్లి (తాడేపల్లి): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో శుక్రవారం రాత్రి పెళ్లి మండపం కూలి మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో సహా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఉండవల్లిలోని దేవుడు మాన్యంలో ఏర్పాటు చేసిన మండపం ఉన్నట్లుండి కూలిపోయింది. అదే సమయంలో వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహా పెళ్లి కుమారుడి బంధువులు కల్పన, సామ్రాజ్యం, శరణ్య, పెళ్లి కుమారుడు తండ్రి గణపతిరెడ్డి, వైకాపా నాయకులు దంటు బాలాజీరెడ్డి గాయపడ్డారు. శరణ్యను విజయవాడలోని ప్రైవేటు వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా మిగిలిన వారికి స్థానికంగా వైద్యం చేయించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుడికాలి పాదానికి గాయం కావడంతో ఆయన్ను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు పిండికట్టు వేశారు. ఇలా ఉండగా వివాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా పక్కనే ఏర్పాట్లు చేసి పెళ్లి జరిపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని