పంజాబ్‌లో పదవీ విరమణ 58ఏళ్లకు కుదింపు
close

తాజా వార్తలు

Published : 29/02/2020 17:28 IST

పంజాబ్‌లో పదవీ విరమణ 58ఏళ్లకు కుదింపు

చండీగర్‌: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లు కుదిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఇప్పటి వరకూ 60 సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ వయసు 58కు తగ్గనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మన్‌ప్రీత్‌సింగ్‌ బాదల్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగాల కల్పన మూడు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ రెండు విడతలుగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 59 ఏళ్లు నిండిన వాళ్లు మార్చి 31న, 58 ఏళ్లు నిండిన వాళ్లు సెప్టెంబర్‌ 30న విరమణ పొందాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.50లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని ఆయన తెలిపారు.
బడ్జెట్‌ సమావేశాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,54,805కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. 12వ తరగతి వరకూ అందరికీ ఉచిత విద్యతో పాటు భూమిలేని రైతులకు రుణ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు 10 లక్షల స్మార్ట్‌ఫోన్లు అందజేయడం కోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించామన్నారు. ఏప్రిల్‌లో ఈ ఫోన్లు అర్హులైన యువతకు అందజేస్తామని తెలిపారు. పన్నుల విధింపులోనూ ఆయన పలు సడలింపు నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపాలిటీల పరిధిలో పరిశ్రమలు నెలకొల్పే వారికి ఉన్న పన్ను 4 నుంచి 1శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని