కరోనా వార్డుల్లో డ్యాన్స్‌లు..వీడియోలు వైరల్‌! 
close

తాజా వార్తలు

Published : 06/03/2020 02:29 IST

కరోనా వార్డుల్లో డ్యాన్స్‌లు..వీడియోలు వైరల్‌! 

టెహ్రాన్‌: కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించడం అంటే సాధారణ విషయం కాదు. ఆ వైరస్‌ నుంచి వైద్యులు తమను తాము కాపాడుకోవడమూ ఎంతో ముఖ్యం. ఆ విషయానికొస్తే ఇరాన్‌ వైద్యులు విభిన్నంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.  కరోనా వైరస్‌తో ఆస్పత్రికి వచ్చిన రోగులకు చికిత్స అందించడంతో పాటు.. నృత్యాలు చేస్తూ తమకు తాము మనోధైర్యాన్ని పొందుతున్నారు. అలా వారు చేసిన పలు డ్యాన్సింగ్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

‘కరోనా వైరస్‌ ఇరాన్‌ డ్యాన్సింగ్’ పేరుతో ట్విటర్‌లో ఈ వీడియోలు దర్శనమిస్తున్నాయి. వాటిల్లో మాస్కులు, రక్షణాత్మక వస్త్రాలు ధరించిన కొందరు వైద్యులు ఇరానీ సంగీతానికి నృత్యం చేస్తూ కనిపించారు. ఆ సన్నివేశాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పోస్ట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే లక్షకు పైగా నెటిజన్లు వీక్షించారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘వారు రోగులను చూసుకుంటూ.. అదేవిధంగా వారి కుటుంబాల్లోనూ మనోధైర్యాన్ని నింపుతున్నారు’ అని కామెంట్‌ చేశారు. మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకూ 100 మందికి పైగా మరణించారు. చైనా తర్వాత ఎక్కువ మరణాలు సంభవించింది కూడా ఇరాన్‌లోనే కావడం గమనార్హం. ఏప్రిల్‌ 1 వరకు పాఠశాలలు, వర్శిటీలకు సెలవులు ప్రకటించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు. 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని