‘తిరుపతిని హైరిస్క్‌ ఏరియాగా గుర్తించాలి’

తాజా వార్తలు

Updated : 16/03/2020 16:07 IST

‘తిరుపతిని హైరిస్క్‌ ఏరియాగా గుర్తించాలి’

మాజీ ఎంపీ చింతామోహన్‌ డిమాండ్‌

తిరుపతి: దేశవ్యాప్తంగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చే తిరుపతి నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతామోహన్‌ కోరారు. తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తిరుపతిని హైరిస్క్‌ ఏరియాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి నిత్యం లక్షమంది భక్తులు తరలివస్తారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం నేపథ్యంలో నగరంలోని రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులు ఏ మాత్రం సరిపోవని అభిప్రాయపడ్డారు. 

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు జరిపాకే నగరంలోకి అనుమతించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని చింతామోహన్‌ డిమాండ్‌ చేశారు. దీని కోసం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని పద్మావతి వైద్య బోధనాసుపత్రిని తాత్కాలిక కేంద్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన  సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపైనా ఆయన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులందరినీ ఏకగ్రీవంగా ప్రకటించుకుని జాబితాను కేంద్రానికి పంపించి ఉంటే ఈ పాటికి కేంద్రం నుంచి నిధులు వచ్చేవని చింతా మోహన్‌ ఎద్దేవా చేశారు. 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని