జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి: ఆళ్ల నాని

తాజా వార్తలు

Updated : 21/03/2020 17:50 IST

జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి: ఆళ్ల నాని

కంటి వెలుగు వాయిదా
కొత్తగా మరో రెండు ల్యాబ్‌లు

అమరావతి: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, ఆ చర్యలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం కూడా అవసరమని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నామన్నారు. ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు ఈ కర్ఫ్యూ ఉపయోగపడుతుందని, నిర్దేశించిన సమయంలో భాగస్వాములు కావడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని నాని అన్నారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో అత్యవసర సిబ్బంది త్యాగనిరతి అసామాన్యమని నాని కొనియాడారు. రేపటి కర్ఫ్యూలో వారికి సంఘీభావంగా సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. కర్ఫ్యూ అనంతరం కూడా డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలను పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా నిలిపివేస్తున్నామని చెప్పారు. ఎక్కవ మంది ఇందులో భాగస్వాములు అవుతారు కాబట్టి సీఎం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వారందరి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. 

కొత్తగా మరో రెండు ల్యాబ్‌లు
కరోనా వైరస్‌ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ఆహారాన్ని ఇంటికే ఇవ్వాలని ఆదేశిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి చెప్పారు. 10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్ల వయసు పైబడిన వారు బయటకు రాకూడదని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మూడు ల్యాబ్‌లతో పాటు అనంతపురం, గుంటూరులో మరో రెండు ల్యాబ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. శ్రీశైలంలో జరిగే ఉగాది కార్యక్రమాలకు వచ్చేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని