‘ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయండి’

తాజా వార్తలు

Published : 23/03/2020 20:53 IST

‘ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయండి’

ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఓటాన్‌ అకౌంట్‌ను ఆర్డినెన్స్‌ ద్వారా కూడా ఆమోదించుకునే అవకాశముందని నివేదించింది. 2004లోనూ ఇదే తరహాలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నపుడు ఆర్డినెన్స్‌ ద్వారా ఓటాన్‌ అంకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించారని గుర్తుచేసింది. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వీలైనంత వరకు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు తెలిపారు. కరోనా నిరోధక చర్యల్లో పాల్గొంటున్న క్షేత్రస్థాయి ఉద్యోగులకు అన్ని ఉపకరణాలూ అందించాలని కోరామన్నారు. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సచివాలయ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. విరాళాల కోసం ఇతర ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామని ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని