నిత్యావసరాలకు ఒంటిగంట వరకే..:ఆళ్లనాని

తాజా వార్తలు

Updated : 26/03/2020 13:53 IST

నిత్యావసరాలకు ఒంటిగంట వరకే..:ఆళ్లనాని

అమరావతి: కరోనా వైరస్‌ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు  ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష అనంతరం నాని మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం సూచించినట్లు చెప్పారు. రైతు బజార్లు ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయాలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ ఆదేశించారని.. ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయనున్నట్లు నాని వివరించారు. 

రైతు బజార్లకు ప్రజలు ఒకేసారి పెద్ద సంఖ్యలో వస్తున్నారని.. అందుకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ 2 కి.మీ దాటకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. నిత్యావసర దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించామన్నారు. దీనికి ప్రజలకు సహకరించాలని కోరారు. నిత్యావసర ధరల పెరుగుదల, బ్లాక్‌ మార్కెటింగ్‌ నివారణకు 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశామని.. ఆ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కొంత ఇబ్బందికరమే అయినా ప్రజలంతా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని