విద్యార్థులను ఖాళీ చేయించొద్దు: తలసాని

తాజా వార్తలు

Updated : 26/03/2020 12:54 IST

విద్యార్థులను ఖాళీ చేయించొద్దు: తలసాని

హైదరాబాద్‌: సనత్‌నగర్‌ నయోజకవర్గ పరిధిలోని పలు దుకాణాలను, సూపర్ మార్కెట్లను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనిఖీ చేశారు. ఎర్రగడ్డ మార్కెట్ లో పరిస్థితిని పరిశీంచిన తర్వాత యూసఫ్ గూడ లోని ఓ సూపర్ మార్కెట్ ను తనిఖీ చేశారు. మార్కెట్ రేటుకు ఇక్కడకు 15 రూపాలయలు తేడా ఉండటంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అనంతరం వసతిగృహాల నిర్వాహకులతో మంత్రి సమావేశమయ్యారు. వసతిగృహాల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించొద్దని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతిగృహాల నిర్వాహకులు ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని