లాక్‌డౌన్‌ వేళ.. డోర్‌ టూ డోర్‌ ఏటీఎం సేవలు

తాజా వార్తలు

Published : 28/03/2020 18:19 IST

లాక్‌డౌన్‌ వేళ.. డోర్‌ టూ డోర్‌ ఏటీఎం సేవలు

చండీగఢ్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అత్యావసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేశారు. అయితే ప్రజల వద్ద నగదు కొరత రావొద్దని భావించిన కేంద్రం.. ఏటీఎంల్లో డబ్బు ఉపంసహారణపై ఇటీవల ఛార్జీలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. కాగా పంజాబ్‌ ప్రభుత్వం ఏకంగా ఏటీఎంలనే ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టింది.
ప్రజలకు నగదు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పంజాబ్‌ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఓ మినీ వ్యాన్‌లో ఏటీఎం మిషన్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచింది. ‘‘కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం.. ఏటీఎంలో నగదు డ్రా చేసే ముందు ఖాతాదారులు సామాజిక దూరం పాటించేలా..  చేతులను శుభ్రం చేసుకుని నగదు డ్రా చేసుకునేలా ఏర్పాట్లు చేశాం’’ అని బ్యాంక్‌ అధికారి తెలిపారు. అనంతరం వ్యాన్, ఏటీఎం మిషన్‌ను శానిటైజర్‌తో శుభ్రం చేస్తామని ఆ అధికారి వెల్లడించారు. ఇంటింటికి ఈ సేవలు అందడంతో వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని