కేసులు పట్టణాల్లోనే అధికం: ఆళ్ల నాని

తాజా వార్తలు

Updated : 28/03/2020 19:00 IST

కేసులు పట్టణాల్లోనే అధికం: ఆళ్ల నాని

విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి

అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులన్నీ అర్బన్‌ ప్రాంతాల్లోనే నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని చెప్పారు. ఇప్పటి వరకు నమోదైన 13 పాజిటివ్‌ కేసుల్లో 12 అక్కడివేనని తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి కూడా చర్చించామని వివరించారు. ఈ మేరకు సీఎం జగన్మోహన్‌రెడ్డితో సమీక్ష అనంతరం మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, బుగ్గనతో కలిసి మీడియాతో మాట్లాడారు.

‘‘కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చర్చించాం. నిత్యావసరాల కొనుగోలు సమయం గురించి చర్చించాం. పలు చోట్ల దుకాణాలు, మొబైల్‌ దుకాణాలు ఏర్పాటుచేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికుల విషయమై కూడా చర్చించాం. వారి కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తాం. సరిహద్దుల్లో ఉన్న వారికి ఆహారం, దుస్తులు అందించేందుకు యోచిస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి గురించి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో ఇప్పటికే మాట్లాడాం.

ఏపీలో 13 కేసులు నమోదు కాగా.. 12 పాజిటివ్‌ కేసులు అర్బన్‌ ప్రాంతాల్లో నమోదైనవే. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. పట్టణాలు, నగరాల్లో మరిన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైన వారిని ఐసోలేషన్‌ వార్డులకు తరలించాలని సూచించారు. ప్రతి 10 మందికి ఒక వైద్యుడి, నిపుణుడిని కేటాయిస్తాం. విదేశాల నుంచి 29,264 మంది వచ్చినట్లు గుర్తించాం. ఇంకా ఎవరైనా ఉన్నారో తెలుసుకునేందుకు మరోసారి సర్వే చేస్తున్నాం’’ అని నాని వివరించారు. 14 రోజుల క్వారంటైన్‌కు ఒప్పుకుంటే రాష్ట్రంలోకి వచ్చేందుకు అంగీకరిస్తామని మరో మంత్రి బొత్స చెప్పారు. నిత్యావసరాలు సరఫరా చేసేందుకు సంచార దుకాణాలు ఏర్పాటు చేస్తామని, రైతు బజార్లు మరిన్ని పెంచుతామని తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని