కరోనాతో గుండె కండరాలు దెబ్బతింటున్నాయి

తాజా వార్తలు

Updated : 30/03/2020 15:02 IST

కరోనాతో గుండె కండరాలు దెబ్బతింటున్నాయి

హ్యూస్టన్‌: నావెల్‌ కరోనా వైరస్‌ సోకితే ఊపిరితిత్తుల్లో వాపు వస్తుంది. ఫైబ్రోసిస్‌ వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని తెలిసిన సంగతే. గుండె పనితీరూ దెబ్బతింటోందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. అంతకు ముందు హృద్రోగాలు లేని వ్యక్తుల గుండె కండరాలు దెబ్బతింటే ఇక అప్పటికే ఉన్నవారిలో సమస్య మరింత జటిలంగా కనిపిస్తోందని వెల్లడించింది. హృదయంపై కరోనా ప్రభావాన్ని ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం వైద్యశాస్త్ర కేంద్రం పరిశోధకులు తెలిపారు. జామా కార్టియాలజీ జర్నల్‌లో ఫలితాలను ప్రచురించారు.

‘గుండె సమస్యలు లేని కొవిడ్‌-19 రోగుల్లో హృదయ కండరాలు దెబ్బతింటున్నాయి. ఇక అప్పటికే గుండె వ్యాధులు ఉన్న వారిలో ప్రమాద స్థాయి తీవ్రంగా ఉంటోంది’ అని అధ్యయనంలో పాలుపంచుకొన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ మజిద్‌ తెలిపారు. గతంలో ఉద్భవించిన కరోనా వైరస్‌, ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి వైరస్‌లతో హృద్రోగాలు వస్తున్నాయని, గుండె లయ దెబ్బతింటోందని పరిశోధన బృందం పేర్కొంది. కొన్ని సార్లు గుండె విఫలమవుతోందని  వెల్లడించింది.

కొవిడ్‌-19 సోకిన హృద్రోగుల మరణాల రేటు 10.5 శాతం ఉందని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ బులెటిన్‌ విడుదల చేసిందని ఆ బృందం గుర్తుచేస్తోంది. గుండె జబ్బులు, హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న 65 ఏళ్ల పైబడ్డ రోగులకు దాదాపు క్రిటికల్‌ కేర్‌ అవసరం అవుతోందని పేర్కొంది. వుహాన్‌లో పుట్టిన నావెల్‌ కరోనా వైరస్‌ ప్రపంచమంతా వ్యాపించింది. చైనా ముందుగా ఈ వైరస్‌ గురించి సరైన సమాచారం ఇతర దేశాలతో పంచుకోకపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తల్లడిల్లుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 7.23 లక్షల కరోనా కేసులు నమోదవ్వగా దాదాపు 34వేల మంది మృత్యువాత పడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని