అనుపమ నాదెళ్ల రూ.2 కోట్ల సాయం

తాజా వార్తలు

Updated : 31/03/2020 23:47 IST

అనుపమ నాదెళ్ల రూ.2 కోట్ల సాయం

హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ల తన మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్‌పై పోరుకు ఆమె రూ.4 కోట్లు విరాళం ఇచ్చారు. పీఎం కేర్స్‌కు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల చొప్పును సాయం చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. ‘‘కొవిడ్‌-19ను ఎదుర్కోవడానికి ఆమె వ్యక్తిగత ఆదాయం నుంచి పీఎం కేర్స్‌, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల చొప్పును సాయం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ ఆమెకి మాతృభూమి పట్ల ఎంతో ప్రేమ ఉందనడానికి ఇది ఉదాహరణ’’ అని వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని