రాముడి జీవితం అందరికీ ఆదర్శం: మోదీ

తాజా వార్తలు

Updated : 02/04/2020 13:37 IST

రాముడి జీవితం అందరికీ ఆదర్శం: మోదీ

దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి


 

న్యూదిల్లీ: శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీలు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాముడి జీవితం అందరికీ ఆదర్శమని, ప్రతి ఒక్కరూ విలువలు, ఓర్పు, సహనం, స్నేహభావాలను పెంపొందించుకోవాలనే సందేశాన్ని ఈ సందర్భంగా మోదీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించునేలా ప్రతిజ్ఞ చేయాలంటూ ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అదే విధంగా రామ నవమి సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. 

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమినాడు శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. అయితే ప్రస్తుతం కరోనా కట్టడిలో భాగంగా దేశంలో 21 రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో అత్యవసర సేవలు మినహా అన్ని వాణిజ్య, సరకు రవాణా సేవలు స్తంభించాయి. ఆలయాల్లో నిత్య పూజలు జరుగుతున్నా, భక్తులెవర్నీ అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ బహిరంగ రామనవమి వేడుకలకు దూరంగా ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని