ఆ ఐదేళ్ల చిన్నారికి కరోనా నెగిటివ్‌

తాజా వార్తలు

Published : 03/04/2020 21:49 IST

ఆ ఐదేళ్ల చిన్నారికి కరోనా నెగిటివ్‌

ముంబయి: కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించిన ఐదేళ్ల చిన్నారికి తాజా పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ముంబయిలోని చెంబూర్‌కు చెందిన ఓ మహిళ, ఆమె కుమారుడికి కొవిడ్‌-19 ఉన్నట్లు మార్చి 26న వైద్యులు వెల్లడించారు. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి బెడ్‌ను వాడటం వల్ల తల్లీకొడుకులకు ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. తొలుత వీరికి కుర్ల బాబా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆపై తీవ్రను గుర్తించి కస్తుర్బా ఆసుపత్రికి తరలించారు. తాజా రిపోర్ట్‌లో బాలుడికి నెగిటివ్‌ వచ్చినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు శుక్రవారం తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు తదుపరి చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో 2301 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. మహారాష్ట్రలో దీని ప్రభావం అత్యధికంగా ఉంది. అక్కడ 335 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో 42 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 16 మంది మృతి చెందారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని