లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. తండ్రిపై కుమారుడి ఫిర్యాదు

తాజా వార్తలు

Updated : 04/04/2020 16:02 IST

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. తండ్రిపై కుమారుడి ఫిర్యాదు

దిల్లీ : కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండి ఈ మహమ్మారిపై పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే పలువురు మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార యంత్రాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పాటించని తండ్రిపై ఓ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది.

ఓ 30 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో కలిసి  పశ్చిమ దిల్లీలోని  రాజోకారి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో తన తండ్రి ప్రతి రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు వెళ్తున్నాడని.. ఎన్ని సార్లు చెప్పినా వినడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతని నివాసానికి చేరుకున్నారు. బయటకు వెళ్లిన అతని తండ్రిని ఇంట్లోకి వెళ్లమని చెప్పగా.. వారి మాట వినలేదు. దీంతో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తండ్రిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని