ఏప్రిల్‌ 7న చంద్రుడిలో భారీ మార్పులు

తాజా వార్తలు

Published : 06/04/2020 01:38 IST

ఏప్రిల్‌ 7న చంద్రుడిలో భారీ మార్పులు

ఇంటర్నెట్‌డెస్క్‌: 21వ శతాబ్దంలో ఈ ఏడాది ఎంతో నిరాశపరుస్తోంది. బుష్‌ఫైర్‌తో ఆస్ట్రేలియా నష్టపోగా‌, కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమంతా విలవిలలాడుతోంది. ప్రకృతి విపత్తులతో అందరూ అల్లాడిపోతున్నారు. అయితే ఏప్రిల్‌ 7న రాత్రి 8.30 సమయంలో చంద్రుడిలో భారీ మార్పులు కనిపించనున్నాయి. పౌర్ణమి రోజు సాధారణంగా కనిపించే దాని కంటే ఆకారంలో 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమివ్వనున్నాడు. దీన్ని పింక్‌ సూపర్‌ మూన్‌గా అభివర్ణిస్తారు. ఈ ఏడాదిలో చంద్రుడు పెద్దగా కనిపించే రోజు ఇదే.

దీర్ఘవృత్తాకార కక్ష్యలో చంద్రుడు పెరిజీ స్థానంలోకి వచ్చినప్పుడు ఇది సంభవిస్తుంది. కక్ష్యలో భూమికి చంద్రుడు దగ్గరిగా ఉండే స్థానాన్ని పెరిజీ అంటారు. అలానే దూరంగా ఉండే స్థానాన్ని అపొజీ అంటారు. మంగళవారం రాత్రి చంద్రుడు పెరిజీ స్థానానికి చేరుకోనుండటంతో ఆ సమయంలో పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. పింక్‌ సూపర్‌ మూన్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు పెరిజియన్‌ ఫుల్‌ మూన్‌ అని అంటారు. అయితే ఉత్తర అమెరికాలో ఫ్లోక్స్‌ సుభలట అనే అడవి పువ్వు పేరు మీదగా పింక్‌ మూన్ అని పేరు వచ్చింది. అది గులాబీ రంగులో ఉంటుంది. అయితే పింక్‌ మూన్‌ గులాబీ రంగులో ఉండదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని