మా రక్షణ సంగతేంటి: వైద్యుల ధర్నా

తాజా వార్తలు

Published : 06/04/2020 19:30 IST

మా రక్షణ సంగతేంటి: వైద్యుల ధర్నా

ఔరంగాబాద్‌: కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రోగులకు చికిత్స అందించే వైద్యులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఔరంగబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని జూనియర్‌ వైద్యులు తమకు కరోనా వైరస్‌ సోకకుండా అవసరమైన పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌), ఎన్‌ 95 మాస్కులను అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ధర్నా చేశారు. ఆస్పత్రిలోని ఇద్దరు రోగులు, సిబ్బంది ఒకరికి ఇటీవలే కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారిలో ఆందోళన మరింత ఎక్కువైంది. దీనికి సంబంధించి వైద్య కళాశాల డీన్‌కు మెమొరాండం సమర్పించారు.

మహారాష్ట్ర వైద్యుల సంఘం ఔరంగబాద్‌ యూనిట్‌ సంఘం అధ్యక్షుడు డా.ఆమీర్‌ తాడ్వీ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయని తెలిసినా వ్యక్తిగత రక్షణ కిట్‌లను అందించకపోవటం దారుణమన్నారు. రోజూ 50 నుంచి 100 మంది రోగులకు చికిత్స అందించాల్సి ఉంది. మాస్కుల్లేకుండా వార్డుల్లోకి వెళితే చాలా ప్రమాదం అని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం తమ డిమాండ్‌లను ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చికి తెలిపామన్నారు. తామేమీ వైద్యం చేయననడంలేదని, పీపీఈ కిట్లను ఇస్తే మరింత మెరుగ్గా సేవలను అందిస్తామని వైస్‌ ప్రెసిడెంట్‌ డా.సందీప్‌ చౌహన్‌ అన్నారు. దీనిపై డీన్‌ స్పందిస్తూ వైద్యులకు అవరమైన పీపీఈ కిట్లను త్వరగా అందిచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని