మతమేదైనా మనమంతా ఒకటే..

తాజా వార్తలు

Published : 07/04/2020 23:38 IST

మతమేదైనా మనమంతా ఒకటే..

ఇండోర్‌: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ మనుషులంతా కులమతాలకు అతీతంగా ఒకరికొకరు సహరించుకుంటున్నారు. కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. ఒక వృద్ధురాలు అంత్యక్రియలకు ఆమె కూమారులిద్దరికి దగ్గర సరిపడా డబ్బు లేకపోవడంతో ముస్లింసోదరులు ముందుకువచ్చారు. దగ్గరుండి ఆమెకు అంతిమసంస్కారం చేయించారు. ఇండోర్‌లోని జునా ప్రాంతంలో నివాసం ఉంటూ దుర్గామాగా పిలువబడే 65 ఏళ్ల వృద్ధురాలు సోమవారం ఇతర ఆనారోగ్యకారణాలతో మరణించింది. వేరే ప్రాంతంలో ఉన్న ఆమె కుమారులకు ఈ సమాచారం అందించగా వెంటనే ఇండోర్‌కు చేరుకున్నారు. అయితే తల్లి దహనసంస్కారాలు చేసేందుకు వారివద్ద సరిపడా డబ్బులు లేవు. విషయం తెలుసుకున్న స్థానికంగా ఉండే ముస్లింయువకులు అక్కడికి చేరుకుని దహనసంస్కారాలకు అవసరమైన ఏర్పాట్లు చేసి వారే స్వయంగా పాడెను మోస్తూ శ్మశానానికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సామాజిక మధ్యామాల్లో ఉంచగా నెటిజన్ల నుంచి అనూహ్యస్పందన లభించింది. హిందూ-ముస్లిం భాయీ భాయీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ దృశ్యం మీరు చూడండి.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని