23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌

తాజా వార్తలు

Updated : 07/04/2020 18:43 IST

23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌

మహబూబ్‌నగర్‌ (క్రైం): మహబూబ్‌నగర్‌లో మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కరోనా వైరస్‌ సోకినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్ర్రితం పసికందు తండ్రితో పాటు నాయనమ్మకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజాగా ఆ కుటుంబంలో చిన్నారికి వైరస్‌ సోకింది. మెరుగైన చికిత్స కోసం పసికందును సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

దిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి నుంచే తాజాగా ఈ ముగ్గురికి వైరస్‌ సోకినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు కాగా ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారు. మరోవైపు తాజాగా ముగ్గురికి కరోనా సోకడంతో వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారిని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని