జనాలకు వైరస్‌..ఆ పాండాలకు జోష్‌

తాజా వార్తలు

Published : 08/04/2020 01:25 IST

జనాలకు వైరస్‌..ఆ పాండాలకు జోష్‌

హాంగ్‌కాంగ్‌: కరోనా దెబ్బకు పలు దేశాల్లో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. సందర్శకులతో ఉండే పలు ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి. దీంతో హాంకాంగ్‌లోని ఒక  ‘పాండా’ పార్కులోని పాండాల జంట  సందర్శకులు లేకపోవటంతో సరససల్లాపాలు మొదలుపెట్టాయి. ఇంగ్‌ఇంగ్ అనే ఆడ పాండా, లీలీ అనే మగ పాండా దాదాపు పదేళ్ల తర్వాత ఏకాంతంగా గడిపాయి. 2010లో ఒక్కసారి కలిసిన ఈ జంట మళ్లీ ఇపుడే ఒక్కటయ్యాయని పార్క్‌ సంరక్షకులు అంటున్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలను సామాజిక మాధ్యమాలలో ఉంచగా అనూహ్య స్పందన లభిస్తోంది. సాధారణంగా పాండాలు పునురుత్పత్తిలో అంతగా ఆసక్తి చూపించవని, అందునా బంధీఖానాలో ఉన్నప్పుడు అస్సలు ఆ వ్యాపకమే ఉండదని వారు అంటున్నారు. ఇన్నాళ్లు ఆడ పాండా ఇంగ్‌ఇంగ్ నీళ్లతో ఆడుకుంటూ మడుగు దగ్గర గడపగా, లీలీ ఆ మడుగు చుట్టూ తిరుగుతూ ఇంగ్‌ఇంగ్‌ను ఆకర్షించడానికి ప్రయత్నించేదని సంరక్షకులు చెబుతున్నారు. ప్రస్తుతం పాండాలు వాటి తోకల ద్వారా ఒకదానికొకటి ప్రేమ సంకేతాలు పంపుకుంటున్నాయన్నారు. జంతునిపుణులు ఇంగ్‌ఇంగ్‌ గర్భధారణ సంకేతాలను గమనిస్తున్నారని, పాండాల గర్భధారణ సమయం 72 రోజుల నుంచి 324 రోజలు ఉంటుందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఇంగ్‌ఇంగ్‌లో గర్భధారణ సంకేతాలు కనిపిస్తున్నాయని, త్వరలోనే పిల్లపాండా రానుందని పార్క్‌ సంరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని