భక్తులు లేకుండానే కొండగట్టు హనుమాన్‌ జయంతి

తాజా వార్తలు

Published : 08/04/2020 12:12 IST

భక్తులు లేకుండానే కొండగట్టు హనుమాన్‌ జయంతి

కొండగట్టు: జగిత్యాల జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులు లేకుండానే హనుమాన్‌ జయంతి వేడుకలను ఆలయ సిబ్బంది నిరాడంబరంగా నిర్వహించారు. ఏటా నిర్వహించే హనుమాన్‌ జయంతికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేవారు. పలువురు భక్తులు దీక్ష విరమణ చేసేవారు. 

అయితే, ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆలయం వెలవెలబోతోంది. భక్తులతో కిటకిటలాడే క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆలయ అర్చకులు, అధికారుల సమక్షంలోనే వేడుకలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. హనుమాన్‌ జయంతిని పురష్కరించుకొని భక్తులు ఎవరూ ఆలయానికి రాకుండా కొండపైకి చేరుకునే ప్రధాన రహదారిని భద్రతా సిబ్బంది మూసివేశారు. గత 25 ఏళ్లుగా ఆలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలను ఘనంగా జరుపుతుండగా.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా తొలిసారి భక్తులు లేకుండానే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని