కరోనా నిర్ధరణ పరీక్షలకు ‘ట్రూనాట్‌ పరికరాలు’

తాజా వార్తలు

Published : 11/04/2020 19:55 IST

కరోనా నిర్ధరణ పరీక్షలకు ‘ట్రూనాట్‌ పరికరాలు’

అమరావతి: కరోనా పరీక్షలను వేగవంతం చేయడానికి క్షయ వ్యాధి నిర్ధరణకు ఉపయోగించే ట్రూనాట్‌ పరికరాలను ప్రభత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో వీటితో వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేపట్టారు. సాధారణంగా బీఎస్‌ఎల్‌(బయో సేఫ్టీ క్యాబినెట్‌ లెవల్‌)-2లో పాజిటీవ్‌, బీఎస్‌ఎల్‌-3లో నెగిటీవ్‌ ప్రెజర్‌ ఉంటుంది. నెగిటీవ్‌ ప్రెజర్‌ ఉన్నగదుల్లో ఈ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తంలో అవి అందుబాటులో లేకపోవడంతో బీఎస్‌ఎల్‌-2లోనూ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తిరుపతిలోని వేంకటేశ్వర పశువైద్య కళాశాలలో బీఎస్‌ఎల్‌-3 సౌకర్యం అందుబాటులో ఉన్నందున వాటిలోనే పరీక్షలు చేస్తున్నట్లు అక్కడి లాబరేటరీ ఇన్‌ఛార్జి తెలిపారు. 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని