ఆ లేఖ రాసింది నేనే:నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

తాజా వార్తలు

Updated : 16/04/2020 14:29 IST

ఆ లేఖ రాసింది నేనే:నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

అమరావతి: గతంలో కేంద్రహోంశాఖకు రాసిన లేఖ వివాదంపై రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు. కేంద్రహోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎంపీ విజయసాయిరెడ్డి సహా వైకాపా నేతల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో ఆ లేఖ నేనే రాశా. ఎన్నికల కమిషనర్‌గా నాకున్న అధికార పరిధిలోనే లేఖ రాశాను. ఆ లేఖపై ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా దాన్ని నిర్ధారించారు. దీనిపై ఎలాంటి ఆందోళన, సందేహాలు అవసరం లేదు. దీనిపై ఎలాంటి వివాదాలు, రాద్ధాంతాలకు తావులేదు’’ అని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని