మీరంతా ‘సెల్ఫీ’లు దిగి పంపండి:దిల్లీ ప్రభుత్వం

తాజా వార్తలు

Updated : 16/04/2020 16:38 IST

మీరంతా ‘సెల్ఫీ’లు దిగి పంపండి:దిల్లీ ప్రభుత్వం

దిల్లీ: కరోనా వైరస్‌ అనుమానితులందరిని ఇప్పటికే అన్ని రాష్ట్రాలు హోమ్‌క్వారంటైన్‌లో ఉంచి  నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అయినప్పటికి కొందరు వ్యక్తులు అధికారులు కళ్లుగప్పి నిబంధనలు పాటించకుండా బయట తిరుగుతున్నారు. ఇలాంటివారిని కట్టడి చేసేందుకు దిల్లీ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన యాప్‌ తీసుకురానుంది.  హోమ్‌క్వారంటైన్‌లో ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ ఇంటిలో ఉండి సెల్ఫీ తీసి ఈ యాప్‌లో కంట్రోల్‌రూమ్‌కి పంపాలి. వెంటనే అధికారులు యాప్‌లో ఉన్న సాంకేతికతతో ట్రాకింగ్‌ చేసి వారు ఇంటిలో ఉన్నారా, లేక బయట ఉన్నారా అనే విషయాన్ని నిర్థారిస్తారు. ఇప్పటికే అన్ని జిల్లాల పాలనాధికారులకు ఇందుకు సంబంధించి మార్గనిర్దేశకాలు వెళ్లినట్టు ప్రభుత్వ ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా కంటైన్‌మెంట్‌ జోన్లగా ప్రకటించిన ప్రాంతాల్లో దీనిని మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే యాప్‌ పనితీరుకు సంబంధించి సమీక్షలు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హోమ్‌క్వారంటైన్‌ నిబంధనల అతిక్రమణ కింద ఏప్రిల్‌ 6 నాటికి 250వరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దేశ రాజధానిలో ఇప్పటివరకు మొత్తం 1578 కరోనాపాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 32మంది మృత్యువాతపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని