‘వైద్యపరీక్షల తర్వాతే ఇంట్లోకి రా’

తాజా వార్తలు

Updated : 17/04/2020 08:10 IST

‘వైద్యపరీక్షల తర్వాతే ఇంట్లోకి రా’

భర్తను అడ్డుకున్న భార్య

వెంకటగిరి : ‘వేరే ప్రాంతం నుంచి వచ్చిన నా భర్తను ఇంట్లో దాచిపెట్టి గ్రామాన్ని ఆపదలోకి నెట్టలేను. ముందు పిల్లలు, ఊరు.. తర్వాతే భర్త. అందుకే ఆయన్ను గడప ముందే అడ్డుకున్నా..’ అంటున్నారు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ. నెల్లూరు నగరంలో బంగారం పనిచేస్తున్న ఓ భర్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. ఎలాగోలా ప్రయత్నించి బుధవారం మధ్యాహ్నం వెంకటగిరిలోని ఇంటికి చేరుకోగా భార్య ఆయన్ను ఇంట్లోకి రానివ్వలేదు. ‘ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అనంతరమే ఇంట్లో అడుగుపెట్టాల’ని తెగేసి చెప్పారు. అంతవరకూ స్థానికంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఉండాలని సూచించారు. వలంటీర్లకు సమాచారం ఇచ్చి తన భర్తకు పరీక్షలు నిర్వహించాలని కోరారు. దాంతో ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక వాహనంలో అతన్ని బుధవారం సాయంత్రం నెల్లూరుకు తరలించి వైద్యపరీక్షలు చేసి గురువారం వెంకటగిరికి తీసుకువచ్చారు. ఇతనికి కరోనా ప్రభావం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని