మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు

తాజా వార్తలు

Updated : 17/04/2020 15:51 IST

మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు

మృతిచెందిన అనంతరం వైరస్‌ నిర్ధారణ

చెన్నూరు గ్రామీణం: మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఓ మహిళ మృతిచెందిన తర్వాత పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. చెన్నూరు మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన గద్దె లక్ష్మి(48)ని అనారోగ్య కారణాలతో ఈ నెల 13న కుటుంబసభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిఫార్సు మేరకు అదే రోజు అర్థరాత్రి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో కేవలం పాజిటివ్‌ కేసులు మాత్రమే చూస్తామని వైద్యులు చెప్పడంతో బాధితురాలిని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చేర్పించే క్రమంలో ఈ నెల 14న తెల్లవారుజామున అంబులెన్స్‌లోనే లక్ష్మి మృతి చెందింది. అనంతరం మృతురాలి రక్త నమూనాలను సేకరించారు. ఆ తర్వాత వైద్య బృందం సూచించిన నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం రక్త నమూనాల నివేదికలు రాగా మృతురాలికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆమె నివాసమున్న ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కుటుంబసభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని