డబ్బుల్లేక గుహలో నివాసం ఉన్నారు

తాజా వార్తలు

Published : 20/04/2020 00:29 IST

డబ్బుల్లేక గుహలో నివాసం ఉన్నారు

రిషికేశ్‌లో ఆరుగురు విదేశీయుల గుర్తింపు

రిషికేశ్‌: ఉత్తరాఖండ్‌లోని పుణ్యక్షేత్రం రిషికేశ్‌ సందర్శనకు వచ్చారు ఆ ఆరుగురు విదేశీయులు. రెండు నెలలు అక్కడే గడిపారు. అంతలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. అసలే కొత్త ప్రాంతం.. మరోవైపు తెచ్చుకున్న డబ్బులూ అయిపోయాయి.  ఏం చేయాలో పాలుపోక చివరకు వారు ఓ గుహలోకి వెళ్లిపోయారు. మార్చి 24వ తేదీ నుంచి అక్కడే కాలం వెళ్లదీస్తున్న వారిని స్థానికుల సాయంతో ఎట్టకేలకు గుర్తించిన పోలీసులు.. శనివారం సాయంత్రం క్వారంటైన్‌కు తరలించారు. 
గంగానది నుంచి నీళ్లు..
ఈ బృందంలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మొత్తం ఆరుగురిలో ఉక్రెయిన్‌ నుంచి ఇద్దరు, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్‌, నేపాల్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ‘హోటల్‌లో ఉండేందుకు డబ్బులు లేక వారు తమ సామగ్రితోసహా గుహలోకి చేరిపోయారు. వంటచెరకుతో వంట చేసుకున్నారు. గంగానదిలోనుంచి నీళ్లను తెచ్చుకున్నారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్‌కు తరలించాం. వైద్య పరీక్షల్లో ఎవరిలోనూ కరోనా లక్షణాలు బయటపడలేదు’ అని వివరించారు. మరోవైపు నేటికి దాదాపు 600-700 వరకు విదేశీయులు రిషికేశ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం.  వారి వారి దేశాల చొరవతో క్రమక్రమంగా స్వదేశాలకు తరలుతున్నారని పోలీసులు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని