కరోనా: ఔను, వారిద్దరూ కోలుకున్నారు...

తాజా వార్తలు

Updated : 22/04/2020 22:25 IST

కరోనా: ఔను, వారిద్దరూ కోలుకున్నారు...

పుణె: కరోనా వైరస్‌ వ్యాధి సోకితే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలని భావించేవారికి ధైర్యాన్నిచ్చే ఓ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కొవిడ్‌-19 వ్యాధి సోకిన ఒకే కుటుంబానికి చెందిన 92 ఏళ్ల బామ్మ, అమె మూడేళ్ల మనుమడు ఇద్దరూ ఆ వ్యాధిని జయించారు. వైద్యసేవలు పొందిన అనంతరం వారు క్షేమంగా తమ ఇంటికి తిరిగివెళ్లారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

పుణెకు చెందిన ఓ 60 సంవత్సరాల వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావటంతో ఏప్రిల్‌ మొదటి వారంలో ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వెలువడ్డ ఫలితాల్లో ఆ చిన్నారి, తన బామ్మతో సహా ఆ కుటుంబంలో పదిహేను మందికి కొవిడ్‌-19 సోకినట్టు నిర్ధారణ అయింది. అనంతరం ఆ వ్యక్తి సస్సాన్‌ జనరల్‌ హాస్పిటల్‌ లో ఏప్రిల్‌ 8న మరణించారు. కాగా, అ కుటుంబ సభ్యులకు నగరంలోని సింబయోసిస్‌ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించారు. చికిత్సానంతరం రెండుసార్లు జరిపిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలో వారందరికీ నెగటివ్‌ అని ఫలితాలు వెలువడ్డాయి. వారి 14 రోజుల క్వారంటైన్‌ అవధి కూడా పూర్తి కావటంతో వారు క్షేమంగా తమ గృహాలకు తిరిగివెళ్లారు.

తమ పట్ల శ్రద్ధ వహించి, ఆదరంగా వ్యవహరించిన వైద్యబృందానికి ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక రెండు విభిన్న వయోవర్గాలకు చెందిన ఇద్దరు కరోనా బాధితులకు నయం కావటం పట్ల పుణెలోని సింబయోసిస్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వైద్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని