గణాంక నిపుణుడు.. శతక వీరుడు!

తాజా వార్తలు

Updated : 24/04/2020 07:02 IST

గణాంక నిపుణుడు.. శతక వీరుడు!

 హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 1950లో మొదటిసారి నిర్వహించిన వ్వయసాయ గణాంకాల సేకరణలో కీలకంగా వ్యవహరించిన తెలుగువాడు వక్కలంక రామచంద్రరావు గురువారం తన వందో పుట్టినరోజు వేడుకలు శుక్రవారం జరుపుకోనున్నారు. వి.ఆర్‌.రావుగా సుపరిచితులైన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌ అత్తాపూర్‌లోని తమ్ముడి కూతురు రజనీ వద్ద ఉంటున్నారు. ఆయన ఏపీలోని నూజివీడులో 1920 ఏప్రిల్‌ 24న జన్మించారు. కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌లో అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టికల్‌ మెథడ్స్‌ అభ్యసించి, 1945లో గణాంకశాఖలో ఉద్యోగం పొందారు. వివిధ హోదాల్లో పనిచేసి 1978లో డిప్యూటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. 1976లో యునైటెడ్‌ నేషన్స్‌ స్టాటిస్టికల్‌ విభాగంలో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. 1978-82 వరకు యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రెటేరియట్‌ మొదటి సలహాదారుగా పనిచేశారు. గణాంక విభాగంలో ముఖ్యభూమిక పోషించిన ఆయన పదవీ విరమణ తరువాత నగరంలోనే ఉంటున్నారు. ఆయన సతీమణి లలితారావు అనారోగ్యంతో గతేడాది కన్నుమూశారు. ఇద్దరు కుమారులు అమెరికాలో స్థిరపడ్డారు. ఉదయాన్నే నిద్ర లేవడం, యోగా సాధనే ఆయన ఆరోగ్య రహస్యమని కుటుంబసభ్యులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని