ప్లాస్మా థెరపీతో నలుగురు కోలుకున్నారు

తాజా వార్తలు

Published : 25/04/2020 15:44 IST

ప్లాస్మా థెరపీతో నలుగురు కోలుకున్నారు

దిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌

దిల్లీ: కరోనా వైరస్‌తో క్రిటికల్‌ స్టేజ్‌లో ఉన్న ఆరుగురికి ప్లాస్మా థెరపీ చేస్తే మంచి ఫలితాలు వచ్చాయని దిల్లీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్రజైన్‌ శనివారం వెల్లడించారు. ఏఎన్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలో ఇప్పటివరకు క్రిటికల్‌గా ఉన్న ఆరుగురికి ప్లాస్మా థెరపీ నిర్వహించామని, నాలుగు రోజుల క్రితం నలుగురికి ఈ చికిత్స చేశామని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు దాదాపు కోలుకున్నారని సత్యేంద్ర వివరించారు. ఈ పద్ధతి ద్వారా ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రమాదకర వైరస్‌ నుంచి కోలుకున్నవారు తమ ప్లాస్మాను ఇతరులకు దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ప్లాస్మా థెరపీ అంటే.. ఎవరైనా ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు కోలుకుంటే వారి రక్తంలో వైరస్‌ను చంపే యాంటీబాడీలు తయారవుతాయి. ఆ కోలుకున్న వారి రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు వేరుచేస్తే మిగిలేదే ప్లాస్మా. దాన్ని వైరస్‌తో బాధపడుతున్నవారికి ఎక్కిస్తే వాళ్లలోనూ యాంటీబాడీలు తయారై ఆ వైరస్‌ను చంపేస్తాయి. దీంతో క్రిటికల్‌ స్టేజ్‌లో ఉన్నవారు కూడా కోలుకుంటున్నారు. గతంలోనూ వైద్యులు ఈ పద్ధతిని నిర్వహించి విజయవంతమయ్యారు. దీంతో ఇప్పుడు కరోనా పేషంట్లను కాపాడటానికీ ఈ పద్ధతిని ప్రయోగిస్తున్నారు. దేశరాజధానిలో తొలిసారి ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ విధానాన్ని అమలు చేసింది లోక్‌నాయక్‌ సర్వజనాసుప్రతిలోనే కావడం విశేషం. ఇదిలా ఉండగా, ఇప్పటివరకూ దిల్లీలో 2,514 మంది వైరస్‌ బారిన పడ్డారు. అందులో 50 మంది మృతిచెందగా 857 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లడం విశేషం.

ఇవీ చదవండి

వైద్య సాయం కోసం ‘ఆరోగ్యసేతు’: కిషన్‌రెడ్డి

దగ్గు మాత్రలు కొంటున్నదెవరు?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని