పోలీసులు ఆపారని పీక కోసుకున్నాడు

తాజా వార్తలు

Updated : 28/04/2020 06:29 IST

పోలీసులు ఆపారని పీక కోసుకున్నాడు

జగ్గంపేట : పోలీసులు ద్విచక్ర వాహనాన్ని ఆపారని మనస్తాపం చెంది ఓ వ్యక్తి బ్లేడుతో పీక కోసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన లోవరాజు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జగ్గంపేటలో పోలీసులు ఆపారు. ఈ సందర్భంగా అతడు బ్లేడుతో పీక కోసుకుని అపస్మారక స్థితికి చేరుకోగా.. ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఐ వై.రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ.. మద్యం మత్తు, కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు పీక కోసుకున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని