‘ఒక దేశం.. ఒక రేషన్‌ కార్డు’ సాధ్యాసాధ్యాలు పరిశీలించండి

తాజా వార్తలు

Published : 28/04/2020 22:00 IST

‘ఒక దేశం.. ఒక రేషన్‌ కార్డు’ సాధ్యాసాధ్యాలు పరిశీలించండి

కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన

న్యూదిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు వీలుగా తాత్కాలికంగా ‘ఒక దేశం.. ఒక రేషన్‌ కార్డు’ పథకం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని మంగళవారం పేర్కొంది. వలస కార్మికుల హక్కుల పరిరక్షణలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలంటూ ఇటీవల న్యాయవాది దీపక్‌ కన్సాల్‌ ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై వాదనలు విన్నది. పథకాల అమలు, ఆహార ధాన్యాల పంపిణీలో ఆయా రాష్ట్రాలు స్థానికులకే ప్రాధాన్యం ఇస్తున్నాయని.. దీంతో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది పిటిషన్‌లో ఆరోపించారు. లాక్‌డౌన్‌కు ముందు కేంద్రం ఈ ఏడాది జూన్‌నుంచి ఈ పథకం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని