‘కంటైన్‌మెంట్‌’ పటిష్ఠంగా అమలు:ఏపీ సీఎస్‌

తాజా వార్తలు

Published : 30/04/2020 16:47 IST

‘కంటైన్‌మెంట్‌’ పటిష్ఠంగా అమలు:ఏపీ సీఎస్‌

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణకు కంటైన్‌మెంట్‌ విధానాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరంలో కరోనా నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్‌ జవహార్‌ రెడ్డితోపాటు పలువురు అధికారులతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, కర్నూలు నగరాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్‌జోన్లలో మెడికల్‌ క్యాంపులు, ఫీవర్‌ క్లినిక్‌లను సక్రమంగా నిర్వహించాలని సీఎస్‌ సూచించారు.
 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచి, రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశించారు. విజయవాడ నగరంలో 19 క్లస్టర్లకుగాను మూడు క్లస్టర్లు కృష్ణలంక, కార్మికనగర్‌, అజిత్‌ సింగ్‌ నగర్‌లోనే 120 కేసులు నమోదయ్యాయని.. క్లస్టర్ జోన్లలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ కేసులను గుర్తించి మరుసటి రోజునే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంకటేష్‌ సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. క్వారంటైన్‌లో ఉన్న వారికి 20 రోజులకు సరిపడా నిత్యావసర సరకులతో కూడిన కిట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. అదేవిధంగా నగరంలోని ప్రతి ఇంటికీ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డులను అందించే విధంగా ఆలోచన చేస్తున్నామని ఆయన వివరించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని