గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో క్షౌరశాలలకు అనుమతి

తాజా వార్తలు

Published : 02/05/2020 16:45 IST

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో క్షౌరశాలలకు అనుమతి

న్యూదిల్లీ: ఈ నెల 4వ తేదీ నుంచి మొదలుకానున్న లాక్‌డౌన్‌ మూడో దశలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా రెడ్‌ జోన్లు మినహాయించి గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు తెరుచుకోవచ్చని శనివారం ప్రకటించింది. దీంతోపాటు ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫాంల ద్వారా అన్ని రకాల వస్తువుల విక్రయాలకు పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు జోన్లవారీగా ఆయా కార్యకలాపాల నిర్వహణకూ అనుమతి ఇచ్చింది.

గ్రీన్‌ జోన్లలో..
* 50% సీటింగ్‌ సామర్థ్యంతో బస్సులు నడుపుకోవచ్చు.
* 50% సిబ్బందితో బస్సు డిపోలు పనిచేయొచ్చు.
* దేశవ్యాప్తంగా నిషేధించిన కార్యకలాపాలు మినహా అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
* వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకుగాను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణలు అవసరమని భావిస్తే.. ఈ జోన్లలోనూ ఎంపిక చేసిన కార్యకలాపాలనే అనుమతించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుంది.


ఆరెంజ్‌ జోన్లలో..
(కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట)
* జిల్లాల్లో అంతర్గతంగాగానీ, జిల్లాల మధ్యగానీ బస్సులు నడపడానికి వీల్లేదు.
ట్యాక్సీలు, క్యాబ్‌ల్లో ఒక డ్రైవర్‌, ఇద్దరు ప్రయాణికులకు అనుమతి ఉంటుంది.
* అనుమతించిన కార్యకలాపాల కోసం ప్రైవేటు వాహనాలు జిల్లాల మధ్య రాకపోకలు సాగించొచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని