రామగుండంలో వలస కార్మికుల ఆందోళన 

తాజా వార్తలు

Updated : 03/05/2020 16:09 IST

రామగుండంలో వలస కార్మికుల ఆందోళన 

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్‌టీపీసీలో పనిచేసే వలస కార్మికులు ఆదివారం ఉదయం ఆందోళనకు దిగారు. తమను స్వరాష్ట్రాలకు పంపించాలని డిమాండ్‌ చేస్తూ రాజీవ్‌రహదారిపై బైఠాయించారు. రామగుండం ఎన్‌టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలు  తమను స్వరాష్ట్రాలకు పంపాలంటూ శనివారం ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారి విజ్ఞప్తిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు ఉదయం మరోసారి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. తమను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. సమయం పడుతుందని పోలీసులు చెప్పడంతో వలస కూలీలు తీవ్ర అసహనానికి గురయ్యారు. దాదాపు 400 మంది కూలీలు రాజీవ్‌రహదారిపైకి చేరుకుని ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అక్కడకు చేరుకుని కూలీలతో మాట్లాడారు. రెండు రోజుల్లో కూలీలను సొంత రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని